English   

హిట్ సినిమా రీమేక్ హక్కులు పొందిన బోనీ !

Boney Kapoor buys remake rights of Badhaai Ho
2019-03-19 13:39:19

ఈమధ్య కాలంలో రీమేక్స్ కి ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. దక్షిణాదిన బాగా ఆడిన సినిమాలు బాలీవుడ్లో, అక్కడ బాగా ఆడిన సినిమాలు దక్షిణాదికి రీమేక్ లు ఎక్కువగా అవుతున్నాయి. ఎక్కడో ఒకటీ అరా తప్పా అలా రీమేక్ చేసిన సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. దీంతో నిర్మాతలు కొత్త కధలు వెతికి, వాటి మీద అపనమ్మకంతో డబ్బు పెట్టె బదులు ఆల్రడీ ఒక సారి ప్రూవ్ అయిన సినిమాల మీద డబ్బు పెడదాం అనుకుంటున్నారు. ఇప్పటికే దక్షిణాదిన  బాలీవుడ్ సూపర్‌ హిట్‌ సినిమాలయిన క్వీన్‌, పింక్‌ సినిమాలు రీమేక్‌ అవుతుండగా ఈ లిస్ట్‌లో మరో సూపర్‌ హిట్ సినిమా చేరింది. గత ఏడాది బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా బదాయి హోని దక్షిణాదిన రీమేక్ చేయడానికి హక్కులు కొనేశాడు, శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ బాషలలో తెరకెక్కించేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి ముందు యాడ్ ఫిలిం మేకర్ అయిన అమిత్ శర్మని బోనీనే ముందడుగు వేయించి తేవర్ సినిమా చేయించారని. ఇప్పుడు ఆయన మీదా, సినిమా మీదా ఉన్న నమ్మకంతో ఇప్పుడు సినిమాని దక్షిణాదిన రిలీజ్ చేస్తున్నారని చెబుతున్నారు.

More Related Stories