English   

బాహుబలి సాంగ్ కి సితార డ్యాన్స్...ఫిదా అవ్వాల్సిందే !

mahesh-babu
2019-03-20 01:35:22

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంత ప్రాదాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన ఏమాత్రం అవకాశం ఉన్నా వారితో సమయం గడపడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారితో సమయం గడుపుతున్నప్పుడు వాటిని ఫోన్ తో బందించి వాటిని తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఆయన ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో ఏంటంటే మహేష్ కూతురు సితార బాహుబలిలోని కన్నా నిదురించరా అనే పాటకు ఆమె డ్యాన్స్ వేస్తోంది. ఆ వీడియోని మా సితా పాప, వాటే టాలెంట్ అని పేర్కొంటూ మహేష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తోందని ? డ్యాన్స్ మాత్రమే కాక ఆమె ఆ స్టెప్స్ దగ్గర ఆమె అభినయం చూడచక్కగా ఉంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బుడ్డిది ప్రముఖ క్లాసికల్ డాన్స్ ట్రైనర్ అరుణ భిక్షు దగ్గర సితార డాన్స్ నేర్చుకుంటోందట. ఇప్పటికే ఆమె ఫస్ట్ కూడా లెవల్ పూర్తి చేసిందట. చూడబోతే సితారను తెరంగ్రేటం చేయించేస్తారేమో మరి !

More Related Stories