English   

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా అజయ్ దేవగన్..

Ajay-Devgan
2019-03-20 04:15:25

వరుస సినిమాలతో బాలీవుడ్లో దుమ్ము దులిపేస్తున్నాడు సీనియర్ హీరో అజయ్ దేవగన్. ఓవైపు హిందీ సినిమాలు చేస్తూనే మరో వైపు తెలుగులో రాజమౌళి సినిమాలో కూడా కీలకపాత్రలో నటించబోతున్నాడు ఈయన. దర్శక ధీరుడి సినిమాలో భగత్ సింగ్ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు మరో అద్భుతమైన పాత్ర కూడా అజయ్ దేవగన్ చెంత చేరింది. ఈ మధ్య టోటల్ ధమాల్ తో విజయం సాధించిన అజయ్ దేవగన్ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారిపోయాడు. కామెడీ పాత్రల నుంచి సీరియస్ రోల్స్ వైపు అడుగులు వేస్తున్నాడు అజయ్. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయిపోయాడు ఈ హీరో. 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కబోయే 'భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' అనే సినిమాలో విజయ్ కార్నిక్ అనే ధైర్య సాహసాలు కలిగిన వింగ్ కమాండర్ పాత్రలో నటించబోతున్నాడు అజయ్. భూషణ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ పాత్ర కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు అజయ్ దేవగన్. 1971లో ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధం సమయంలో గుజరాత్‌లోని భూజ్‌ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్తాన్‌ భారీ బాంబు దాడి చేసింది. అప్పుడు విజయ్‌ ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 300 మంది మహిళలను ప్రేరేపించి, భారత ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్ల సహాయంతో ఆ ఎయిర్‌స్ట్రిప్‌లను పునరుద్ధరించి ఆ యుద్ధంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు వింగ్ కమాండర్ విజయ్. ఆ యుద్ధంలో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈయన అలాంటి వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉంది అంటున్నాడు అజయ్ దేవగన్.

More Related Stories