English   

నిన్ను అన్న వాళ్ల‌కు ఇదే చెంప దెబ్బ‌.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ డైలాగ్.. 

Lakshmis-NTR
2019-03-20 05:22:04

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అందులో పాటలు, ట్రైలర్లు, టీజ‌ర్లు వరుసగా విడుదల చేస్తూనే ఉన్నాడు వ‌ర్మ‌. మిగిలిన దర్శకులు ఏదో 30 సెకన్లు 40 సెకన్లు విడుదల చేయడం కాదు.. ఏకంగా ఫుల్  సాంగ్స్ విడుదల చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అలా విడుదల చేయడం వల్ల సినిమాపై అంచనాలు ఇంకా పెరుగుతాయని నమ్ముతాడు ఈ దర్శకుడు. ఎంతైనా బాలీవుడ్ నుంచి వచ్చాడు కదా అక్కడ విడుదలకు ముందే ప్రతి సినిమా వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తారు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో రాంగోపాల్ వర్మ చేస్తున్నది కూడా ఇదే. తాజాగా మరో వీడియో సాంగ్ విడుదల చేశాడు ఈ దర్శకుడు.

విజయం విజయం ఘన విజయం.. విజయం విజయం శుభ సమయం అంటూ సాగే ఈ పాట వర్మ ఆస్థాన రచయిత సిరాశ్రీ రాసాడు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర దారి లక్ష్మీపార్వతి తో చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. నీలాంటి వ్యక్తిని పట్టుకొని ఎన్ని నిందలు మోపారు.. వాళ్లందరికీ ఈ ఘన విజయం ఓ గొప్ప చెప్పు దెబ్బ.. అంటాడు నందమూరి తారకరామారావు. దీన్నిబట్టి లక్ష్మీపార్వతికి ఆయన ఎంత విలువ ఇచ్చాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఆమెను అవమానించిన వాళ్లకు కూడా ఈ డైలాగ్ తో చెప్పు దెబ్బ కొట్టినట్లు చేశాడు అంటాడు ఎన్టీఆర్. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, మోహన భోగరాజు ఈ పాటను ఆలపించారు. మార్చ్ 29 లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories