English   

జనసేనలోకి నాగబాబు...నరసాపురం నుంచి పోటీ

Naga-Babu
2019-03-20 06:21:41

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్, ప్రజల కోసం అంటూ జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల ముందే పార్టీ పెట్టినా పార్టీ సంస్థాగత నిర్మాణం జరగకపోవడంతో ఆయన అప్పటి పరిస్థితుల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి ఆ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల నుండి పక్కకి తప్పుకుని సొంతంగా పోటీకి దిగుతున్నారు. నిన్ననే ఆయన రెండు స్థానాల నుండి పోటీకి దిగుతున్నట్టు ప్రకటించిన నేపధ్యంలో ఈరోజు ఆయన అన్న నాగబాబు కూడా జనసేనలో చేరనున్నట్టు ప్రకటన వచ్చింది. నిజానికి వరుణ్ తేజ్, నాగబాబులు జనసేన పార్టీకి విరాళం ఇచ్చినపుడే వారు పార్టీలో చేరతర్నై భావించారు, కానీ ఆయన చేరలేదు. తాజాగా అనూహ్యంగా ఆయన పేరును తెరమీదకు తెచ్చింది జనసేన. ఉభయగోదావరి జిల్లాల్లోని కీలక స్థానాల్లో ఒకటైన నర్సాపురంలో కాపు బ్యాకింగ్ తో పాటు సినీ గ్లామర్ ఉన్న తన అన్నయ్య నాగబాబు అయితే జిల్లా మొత్తం ప్రభావితం చూపుతారని భావిస్తున్న పవన్ నాగబాబుని ఆ స్థానం నుండి దింపుతున్నట్టు చెబుతున్నారు.

More Related Stories