English   

పాడుపని చేసిన దండుపాళ్యం నటి !

Pooja-Gandhi
2019-03-20 08:18:45

దండుపాళ్యం సినిమాతో తన నటనతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిన పూజా గాంధీ చేసిన ఒక పాడు పని ఆమెని వార్తల్లో నిలిచేలా చేసింది. కన్నడ నటి అయిన ఈమె చేసిన ఘనకార్యం గురించి అక్కడ మీడియా కధానాల ప్రకారం అసలేమైందంటే, ఆమె తాజాగా బెంగుళూరు నగరంలోని ఒక లగ్జరీ హోటల్ లో బస చేశారు. హోటల్ లో చెకిన్ అయ్యేప్పుడు ఆమె రెండు లక్షలు కట్టారు. అయితే ఆమె హోటల్ బిల్లు ఇంకా నాలుగు లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ ఆమె ఏమైందో ఏమో కానీ చల్లగా ఆ బిల్లు కట్టకుండా జారుకుంది. ఆమె కోసం ఎదురు చూసీ చూసీ ఆమె పరారయ్యిందన్న విషయం ఆలస్యంగా గ్రహించిన హోటల్ యాజమాన్యం నటి పూజా తమను మోసం చేసిందని పోలీసు కంప్లయింట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా  సమన్లు జారీ చేశారు. అక్కడికి వచ్చిన పూజా తప్పయిందని ఆ మొత్తాన్ని చెల్లించడానికి తనకు కొంత సమయం కావాలని పోలీసులని, హోటల్ యాజమాన్యాన్ని అభ్యర్ధించింది, ఆమె అభ్యర్ధనకి హోటల్ యాజమాన్యం ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే అప్పటికే మీడియాకి విషయం చేరడంతో ఇది కన్నడ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  

More Related Stories