English   

డబ్బు కోసం కాదు.. కథ నచ్చి చీకటిగదిలో సినిమా చేశాను..

adith-arun
2019-03-20 08:33:34

ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఆ సినిమా హీరో ఆదిత్ అరుణ్. కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈయన.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. అయితే ఇప్పటివరకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. ఆ మధ్య హెబ్బా పటేల్ తో 24 ముద్దులు సినిమా చేశాడు అరుణ్. ఇక ఇప్పుడు మరోసారి ఒక సంచలన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా మార్చి 21న విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తి అయిపోయింది. ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. పూర్తిస్థాయి అడల్ట్ హారర్ కామెడీగా వస్తుంది ఈ చీకటి గదిలో సినిమా. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి అడల్ట్ కామెడీ రాలేదు. బాలీవుడ్ లో వచ్చిన మస్తీ, గ్రాండ్ మస్తీ, గ్రేట్ గ్రాండ్ మస్తీ తరహా అడల్ట్ కామెడీ ఇది. ఇలాంటి సినిమా తెలుగులో ఊహించడం కష్టమే.. కానీ ఇప్పుడు ఈ తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అరుణ్. మిర్చి హేమంత్ ఇందులో మరో హీరోగా నటించాడు. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి కానీ ఫిజికల్ గా మాత్రం ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉండవు అంటున్నాడు ఈ హీరో. ఈ సినిమాను కేవలం డబ్బు కోసం చేశారా అంటే కాదు కథ నచ్చి చేశాను అని సమాధానం చెప్పాడు. సంతోష్ పి జయ కుమార్ ఈ చిత్ర కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిందని.. ఇలాంటి సినిమాలు తెలుగులో రాలేదు అంటున్నాడు అరుణ్. ఇది కేవలం 18 ప్లస్ వాళ్ల కోసం మాత్రమే తీసిన సినిమా అని.. వాళ్లు మాత్రమే వస్తే సరిపోతుంది అంటున్నాడు. ఓ అబ్బాయి తను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో అతనికి ఎదురయ్యే విచిత్రమైన సంఘటనలు ఏంటి అనేది ఈ చిత్ర కథ అంటున్నాడు అరుణ్. మరి ఈ చీకటి గదిలో సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ నచ్చుతుందో చూడాలి.

More Related Stories