English   

ప్ర‌భాస్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందంట‌.. ఫోటోగ్ర‌ఫ‌ర్ తో డేటింగ్.. 

Shraddha-Kapoor
2019-03-20 08:47:38

ప్రభాస్ సాహో హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు బాలీవుడ్లో ముద్దుగుమ్మలు అంతా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు శ్రద్ధ కపూర్ కూడా ఇదే చేస్తుందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈమె ఒక ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తుంది. రోహన్ శ్రేష్ట అనే ఫోటోగ్రాఫర్ తో కొన్ని రోజులుగా ఈమె కలిసి మెలిసి ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వాళ్లు కూడా దీనికి ఎస్ చెప్పలేదు అలాగని కాదు అని కూడా ఖండించలేదు కూడా. ఎక్కడ బయటికి వచ్చినా కూడా కలిసి వస్తున్నారు.. ఈవెంట్లలో కూడా కలిసి కనిపిస్తున్నారు. దాంతో శ్రద్ధ ఇప్పుడు శ్రేష్ట ప్రేమలో పడిపోయిందని వార్తలు వస్తున్న తరుణంలో నిజమే అని తెలుస్తోంది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 30 ఏళ్లు దాటిపోవడంతో శ్రద్ధ కపూర్ పెళ్లి చేసుకోవాలని ఇంట్లో కూడా కంగారు పెడుతున్నారు. దాంతో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి అతనితో పెళ్ళికి ఇంట్లో వాళ్ళని ఒప్పించిందని తెలుస్తోంది. కుదిరితే 2020లో శ్రేష్ట‌, శ్రద్ధ ఒకటి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మధ్యే టైమ్ లేక‌ సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి పక్కకు తప్పుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సాహో, ఏబిసిడి 3, చిచోరా సినిమాలతో బిజీగా ఉంది. ఇవ‌న్నీ పూర్తైన త‌ర్వాత పెళ్లి గురించి ఆలోచించ‌నుంది శ్ర‌ద్ధాక‌పూర్. 

More Related Stories