English   

కీర్తి తెలుగు సినిమా ప్రకటించేశారు !

Keerthy-Suresh
2019-03-20 09:18:23

నేను శైలజ సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసిన కీర్తి సురేష్, మహానటి సావిత్రి జీవితాధరంగా తెరకెక్కిన బయోపిక్ మహానటితో న‌టిగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమె మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. పందెం కోడి అంటూ విశాల్ సినిమాతో వచ్చినా అది డబ్బింగే అయ్యింది. అయితే తాజాగా ఆమె 20వ చిత్రాన్ని ప్రకటించారు. అది తెలుగు సినిమా కావడం విశేషం. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పీఆర్వో, నిర్మాత మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మించ‌నుండ‌గా, న‌రేంద్ర‌నాథ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం కానున్నాడు. ప్ర‌స్తుతం సెట్స్‌ మీద ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ఇందులో న‌టీన‌టుల వివ‌రాలు వెల్లడించింది సినిమా యూనిట్. కమల్ కామరాజు, రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా, భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలుగా పరిచయం చేస్తూ ఈ పోస్టర్ రిలీజయింది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందుతోందట. మరో పక్క కీర్తి మరో బయోపిక్ లో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథ ఆధారంగా బోనీ కపూర్ నిర్మాణంలో ఓ సినిమా తెర‌కెక్కుతుంది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌నుందని అంటున్నారు.  

More Related Stories