English   

జనసేనలో ఫ్యామిలీ పాలిటిక్స్ స్టార్ట్ ..!!

Naga-babu-Pawan
2019-03-20 09:45:32

తన అభిమాన సైన్యంతో జనసేన పార్టీ పెట్టి  రాజకీయాలకి కొత్త అర్ధం చెబుతానంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రచారం చేసారు పవన్ కళ్యాణ్.యువతకు, విద్యావేత్తలకు,మహళలకు ఎక్కువగా అవకాశం ఇచ్చి..ఆంధ్ర రాజకీయాలలో కులం, కుటుంబ రాజకీయాలు లేకుండా చేస్తానని ఆవేశ పూరిత ప్రసంగాలు ఇచ్చారు. కానీ  సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేనాటికి పవన్ స్టేట్ మెంట్స్  మొత్తం గాల్లో కలిసిపోతున్నాయట . అన్ని పార్టీలా మాదిరే జనసేన లో కూడా కుల, కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యత పెరిగిపోతుందని  రాజకీయ వర్గాల ఇన్సైడ్ టాక్. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు  లెక్కలేనన్ని అప్లికేషన్లు వచ్చాయని చెబుతున్న జనసేనాని, కొత్త వారికి కాకుండా ఇంట్లో వాళ్ళకి సీట్లు కేటాయించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. సరికొత్త రాజకీయాలు చేస్తానంటూ.. రెండు స్థానాల్లో పోటీకి దిగుతున్న  పవన్ కళ్యాణ్..తన అన్న నాగబాబుని ఎంపీగా పోటీచేయాలని  డిసైడ్ అవ్వడం  కొసమెరుపు.  గత కొంతకాలంగా పవన్ తోనే వుంటూ ఆయన తరపున కార్యకర్తలతో ముచ్చటిస్తు వస్తున్న నాగబాబు ఫైనల్ గా  ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాపు ఓట్లు ఎక్కువగా వున్న వెస్ట్ గోదావరి నుంచే నాగబాబు పోటీచేయడం విశేషం. మొత్తానికి సరికొత్త రాజకీయాలు చేస్తానంటూ వచ్చిన జనసేనాని.. ఫ్యామిలీ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడని పొలిటికల్ వర్గాల  టాక్.

More Related Stories