English   

అలా అయితే సినిమాలు వ‌దిలేస్తానంటున్న స‌మంత అక్కినేని.. 

Samantha
2019-03-20 10:19:09

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తుంది అక్కినేని కోడలు. సమంత ప్రస్తుతం భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఏప్రిల్ 5 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సమంత సంచలన సమాధానాలు చెప్పింది ఈ భామ‌. మీరు ఎప్పుడు తల్లి కాబోతున్న అని అడిగిన ప్రశ్నకు.. స‌మాధానం ఇస్తూ దానికి ఇంకా సమయం ఉంది.. తను ఎప్పుడు తల్లి కావాలో నిర్ణయించుకుని దానికి కూడా ఫిక్స్ చేసి పెట్టుకున్నారు అని చెప్పి ఆశ్చర్య పరిచింది సమంత. అంతే కాకుండా తాను తల్లిని అయితే మాత్రం కచ్చితంగా నటనకు దూరం అవుతాన‌ని.. అప్పుడు త‌న‌బిడ్డే ప్రపంచం అవుతుందని.. సినిమాలు కూడా చేయను అంటోంది. తను చిన్నప్పుడు చాలా కష్టపడ్డానని.. అలాంటి కష్టం తన బిడ్డకు రాకూడదని ముందు నుంచే జాగ్రత్త పడుతున్నట్లు చెప్పింది సమంత అక్కినేని. ఒకవేళ తన తల్లిని అయితే తనకు మరో ప్రపంచం కూడా ఉండదని తన బిడ్డ తన ప్రపంచం అయిపోతుందని తన కోసం తన జీవితాన్ని సైతం వదిలేస్తాను అంటుంది సమంత అక్కినేని. తనకు పిల్లలు అంటే ప్రాణం అని చాలా రోజుల నుంచి చెబుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. మరి త‌ల్లి ఎప్పుడు అవుతుంది అంటే మాత్రం ఇంకా డేట్ చెప్పడం లేదు. ఏదేమైనా తల్లి అయిన తర్వాత సమంతను సినిమాల్లో చూడటం కష్టమే.

More Related Stories