English   

వర్మ సినిమాకి మరో అడ్డంకి !

Lakshmis-NTR
2019-03-20 12:15:25

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి మొదటి నుండి ఏదో ఒక రూపంలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా చంద్రబాబుకు వ్యతిరేకంగా తీసినట్టు టీజర్స్, ట్రైలర్స్ తేల్చేయడంతో ఈ సినిమాలని ఎలా అయినా రిలీజ్ కాకుండా ఆపాలని, లేదా కనీసం ఎన్నికలయ్యేదాకా అయినా వాయిదా వేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ దాటుకొని సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. తొలుత ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉన్నా సెన్సార్ వాళ్ళు పెట్టిన మెలిక వలన మరో వారం వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ చేయొద్దంటూ మరో ఫిర్యాదు నమోదయ్యింది. తాజాగా, విజయవాడకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దుచేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని సెన్సార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా సీన్లు ఉన్నాయని, చంద్రబాబును అవమానించేలా చిత్రీకరించారని శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తొలుత ఈ సినిమా సెన్సార్ చేయమని, ఎన్నికల తర్వాత చేస్తామని ఆ తర్వాత వర్మ కోర్టుకు వెళ్తాననడంతో సెన్సార్ చేస్తామని చెప్పిన సెన్సార్ సభ్యులు ఇప్పుడు ఈ విషయం మీద ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More Related Stories