English   

ప్ర‌భాస్ నిజంగా అంత సాహసం చేస్తాడా.. ఆర్నెళ్ల గ్యాప్ లోనే..

Prabhas and Radha Krishna film resumes in Hyderabad
2019-03-20 14:28:22

ఓవైపు సాహో సినిమాతో బిజీగా ఉంటూనే మరోవైపు రాధాకృష్ణ కుమార్ సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. ఇప్ప‌టికే ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తయింది. పారిస్ నేప‌థ్యంలో సాగుతున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ కూడా అక్క‌డే జ‌రిగింది. అక్కడ దాదాపు ఇరవై రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని వ‌చ్చాడు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ. జిల్ సినిమాతో ఈయ‌న ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చి ముంద‌డుగు వేస్తున్నాడు ప్ర‌భాస్. ఇక ఇప్పుడు రెండో షెడ్యూల్ కు టైం వ‌చ్చేసింది. సాహో సినిమా చివరి దశలో ఉండగానే ఇప్పుడు రాధాకృష్ణ సినిమాకు డేట్స్ ఇచ్చాడు ప్రభాస్. మార్చి 21 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో వరుసగా 16 రోజుల పాటు రాధాకృష్ణ కుమార్ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ప్రభాస్, పూజ హెగ్డే ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు. రొమాంటిక్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960ల నేపథ్యంలో వస్తోంది. దీని కోసం భారీ సెట్ కూడా వేస్తున్నారు. ఇది కూడా దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ఏడాది షూటింగ్ పూర్తి చేసి అన్నీ కుదిరితే 2020 సంక్రాంతికి రాధాకృష్ణ కుమార్ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బాహుబలి2 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ రెండు సినిమాలతో అభిమానులను తక్కువ గ్యాప్ లో కలుసుకోవాలని చూస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి.

More Related Stories