English   

విజయ్ దేవరకొండ మెగా అల్లుడు కాబోతున్నాడా..క్రేజీ రూమర్..

Vijay-Devarakonda
2019-03-21 01:56:05

మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కుటుంబంలో నాగబాబు కూతురు నిహారికకు కొన్ని రోజుల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇదే విషయంపై నాగబాబు కూడా క్లారిటీ ఇచ్చాడు. మంచి కుర్రాడు దొరికితే వెంటనే కూతురికి పెళ్లి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మెగా బ్రదర్. ఇక ఇప్పుడు మంచి కుర్రాడు దొరికినట్లు తెలుస్తోంది. అతను ఇంకెవరో కాదు విజయ్ దేవరకొండ... నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. సెన్సేషనల్ విజయ్ దేవరకొండను తమ ఇంటి అల్లుడు చేసుకోవడానికి మెగా కుటుంబం ఆసక్తి చూపిస్తుందని తెలుస్తుంది. దీనిపై విజయ్ దేవరకొండ కుటుంబం ఏమనుకుంటుంది అనేది ఇప్పటి వరకు తెలియలేదు.. కానీ ఈ కుర్రాన్ని నిహారిక ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నారు మెగా కుటుంబ సభ్యులు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో ఫ్యూచర్ సూపర్ స్టార్ గా ఎదుగుతున్నాడు విజయ్. మరో 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీని విజయ్ దేవరకొండ ఏలడం ఖాయం అంటూ ఆ మధ్య చిరంజీవి కూడా జోస్యం చెప్పాడు. దాంతో ఈ కుర్రాడ్ని బయటికి వెళ్లనీయకుండా తమ కుటుంబంలోని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు మెగా కుటుంబ సభ్యులు. గతంలో నాగశౌర్యతో నీహారిక పెళ్లి జరుగుతుందని వార్తలు వినిపించాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తేలిపోయింది. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇదే జరుగుతుందా లేదంటే ఏమైనా ఫలితం దిశగా అడుగులు పడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఉదయ్ కిరణ్ ఇన్సిడెంట్ తర్వాత కుర్ర హీరోలు మెగా ఫ్యామిలీతో పెళ్లి సంబంధం అంటే వణికిపోతున్నారు. మరి ఇప్పుడు విజయ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

More Related Stories