English   

పీఎం నరేంద్ర మోడీ ట్రైలర్ టాక్...ఏమాత్రం తక్కువ కాదు !

modi-trailer
2019-03-21 03:17:20

ప్రస్తుతం అన్ని బాషలలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. క్రీడాకారులు, సినిమా స్టార్స్, రాజకీయ నాయకులు వంటి వారి జీవితాలను ఆధారంగా చేసుకుని సినిమాలి తెరకేక్కుతున్నాయి. తాజాగా మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా పీఎం నరేంద్ర మోడీ టైటిల్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బయో పిక్స్ తీయడంలో సిద్దహస్తుడు ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ నరేంద్ర మోడీగా నటిస్తున్నారు. ఎన్నికల ముందు, అదీ సరిగ్గా ఒక్క వారం ముందు ఈ సినిమా రిలీజ్ కానుంది. అందుకే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ జోరు పెంచింది సినిమా యూనిట్. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ టైలర్ లో మోడీ ఛాయ్ అమ్మే స్థాయి నుంచి ఆర్ఆర్ఎస్‌లో జాయిన్ అవ్వడం.  ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనడం వంటి సీన్స్ హైలెట్‌గా ఉన్నాయి. మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రిగా గోద్రా అల్లర్లు, అక్షర్ ధామ్ ఆలయం మీద ఉగ్రవాదుల దాడుల వంటివి ఈ ట్రైలర్‌‌లో చూపెట్టారు. పఠాన్ కోట్ సైనిక శిబిరాలపై ఉగ్రదాడలు జరిగిన తర్వాత చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఈ ట్రైలర్లో హైలెట్ చేసారు. మొత్తానికి ట్రైలర్ చూస్తే బయోపిక్ అయినా ఓక కమర్షియల్ సినిమాకి ఏమాత్రం తక్కువ కాకుండా సినిమా రూపొందించారు అనేది మాత్రం అర్ధం అవుతోంది.

More Related Stories