English   

నాగబాబుకు శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్ సిద్దం !

Shivaji-Raja
2019-03-21 05:30:11

ఇటీవల మా ఎన్నికలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో మనకి తెలియనిది కాదు, గత టర్మ్ నుండి ప్రెసిడెంట్ గా ఉన్న శివాజీ రాజ మళ్ళీ ఎన్నిక అవడానికి ఎన్ని వ్యూహాలు పన్నినా ఈసారి నరేష్ ప్యానెల్ ఎన్నికయింది. అయితే ఈ ఎన్నికల్లో తను ఓడిపోవడానికి చాలా మంది పని చేసారని చెప్పిన శివాజీ రాజా నాగబాబుకు మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు. ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయినా ఆ మాటలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబుకు శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశారట. ఈ క్రమంలో అయన  వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఆయన త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్ హైదరాబాద్ లోటస్‌పాండ్‌‌ లోని నివాసంలోనే ఉన్నారు. అందుకే ఈరోజు శివాజీ రాజా అధ్యక్షుడు అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈరోజు చర్చలు జరిపి 24 న‌ జగన్ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ప్రచారానికి వెల్తున్నాడు కాబట్టి ఆరోజు ప్రచారంలో ఉండగానే శివాజీ రాజా జగన్ గూటికి చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అక్కడ వైసీపీ తరపున ప్రస్తుతం రఘురామ రాజు తరపున శివాజీ మద్దతు ప్రకటించే అవకాశం ఉందని బహుశా నాగబాబు కు శివాజీ రాజా ఇస్తా అన్న‌ రిటర్న్ గిఫ్ట్ ఇదే అయ్యుండచ్చని విశ్లేషణలు ప్రారంభం అయ్యాయి. ఇందులో నిజమెంత ఉందొ తెలీదు కానీ ఈ విషయం అయితే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

More Related Stories