English   

పోసాని కృష్ణమురళికి ఆపరేషన్.. అభిమానులు పరేషాన్..

Posani-Krishna
2019-03-21 07:04:35

ఈ మధ్య పోసాని కృష్ణమురళి పేరు బాగా వినిపిస్తోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో ఏపీ ఎలక్షన్ కమిషన్ ఆయనపై ఫిర్యాదు నమోదు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు అంటూ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు పోసాని కృష్ణమురళి. ఇందులో చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించారు తెలుగు తమ్ముళ్లు. దాంతో చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పోసాని. అసలు సినిమా విడుదల కాకుండానే ఎలా మీరు ఈ సినిమాలో ఈ సన్నివేశాలు ఉన్నాయని ఊహించుకుంటున్నారు.. దాన్ని బట్టి మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా అంటూ నేరుగానే అడిగేసాడు పోసాని కృష్ణ మురళి. ఇదిలా ఉంటే ఈయన్ని ఆంధ్రప్రదేశ్ కు రావాలంటూ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అయితే దీనిపై తాను ఇప్పటికే సంజాయిషీ ఇచ్చానని.. మళ్లీ తాను అమరావతికి వెళ్లే సమస్య లేదు అంటూ కుండబద్దలు కొట్టాడు పోసాని. ఇక ఈయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈయనకు వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఇదే వారంలో ఆయన ఎలక్షన్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉండగా.. ఇప్పుడు ఆయనకు సర్జరీ చేయాలని వైద్యులు తేల్చేశారు. తన సినిమా పూర్తయిన తర్వాత పోసాని ఈ సర్జరీ చేయించుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కో రోజు ఒక్కో రకంగా మారిపోతున్నాయి.

More Related Stories