English   

కన్నడనాట జోరుగా రాజకీయం.. స్టార్ హీరోలకు బెదిరింపులు..

sumalatha
2019-03-21 09:22:11

కన్నడనాట రాజకీయాలు జోరందుకున్నాయి. అక్కడ దివంగత నటుడు అంబరీష్ భార్య సుమలత మాండ్య నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తుంది. ఇదే ఇప్పుడు కన్నడిగులకు అసలు నచ్చడం లేదు. ఎందుకంటే ఇదే స్థానం నుంచి జెడిఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ కూడా పోటీ చేస్తున్నాడు. అతనికి పోటీగా సుమలత ఇండిపెండెంట్గా దిగడం జెడిఎస్ పార్టీ సభ్యులకు అసలు నచ్చడం లేదు. అందుకే ఆ కార్యకర్తలు సుమలత, ఆమెతో పాటు వచ్చిన వాళ్లను బెదిరిస్తున్నారు. ముఖ్యంగా ఆమె కోసం ప్రచారం చేయడానికి వచ్చిన కన్నడ స్టార్ హీరోలు కేజిఎఫ్ ఫేమ్ యశ్, దర్శన్ లను బెదిరిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ వల్ల సినిమాలను నిలిపివేయాలని ప్లాన్ చేస్తున్నారు జెడిఎస్ కార్యకర్తలు. ఇప్పటికైనా వెళ్లి ఇంట్లో కూర్చోకపోతే రాబోయే పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయని వాళ్లను ఓపెన్ గానే బెదిరిస్తున్నారు జెడిఎస్ పార్టీ సభ్యులు. ఈ విషయంపై కన్నడ నాట ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. 

సుమలతని ఎలాగైనా పోటీ నుంచి వెనక్కి దించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దానికి తోడు ఆమెకు తోడుగా ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కూడా బయటకు రావడంతో అభిమానులు ఎక్కడ ఓట్లు వేస్తారో అని కంగారు పడుతుంది అధికార పార్టీ. వెళ్లి కామ్ గా సినిమాలు చేసుకోకుండా మీకు ఎందుకు ఈ ఎన్నికల ప్రచారం అంటూ జెడిఎస్ ఎమ్మెల్యే నారాయణ గౌడ్ ఆ ఇద్దరు స్టార్ హీరోలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు. తమ పార్టీని విమర్శిస్తే అసలు ఊరుకునేది లేదని.. మీరు అసలు సినిమాలు కూడా చేసుకోలేరు అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. మొత్తానికి కన్నడ రాజకీయం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతుంది. సుమలత మాండ్య నియోజకవర్గం నుంచి గెలిచి తన భర్త అంబరీష్ ప్రాతినిధ్యాన్ని తీసుకోవాలని చూస్తోంది. మరి చూడాలిక సుమలత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో.

More Related Stories