English   

నితిన్ సినిమా ప్రకటించేశారు 

Nithin
2019-03-21 09:30:25

గత కొన్నాళ్ళగా ఒక్కటీ సరయిన హిట్ లేకపోవడంతో హీరో నితిన్ డీలా పడ్డాడు. చల్ మోహన్ రంగ సినిమా తర్వాత మనోడు ఏ సినిమా ఒప్పుకోలేదు. ఆయన ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చినా దాని మీద ఇంకా అధికారిక ప్రకటన లేదు. దీంతో నితిన్ ఫ్యాన్స్ లో గందరగోళం ఏర్పడింది. దీంతో అయన ఈ మధ్య ఈనెలలో రెండు సినిమాలు ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. చెప్పినట్టు గానే ఆయన హోళీ సందర్భంగా ఒక సినిమా ప్రకటించాడు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుండగా, ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్న ఈ సినిమాకి నటరాజన్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఆగ‌స్ట్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమా హిట్ కొడుతుందని నితిన్ ఆశిస్తున్నాడు. ఈ సినిమాని తెరకెక్కిస్తున్న దర్శకుడు ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాచ్చసన్ రీమేక్ చేస్తున్నాడు అది పూర్తయ్యాక ఈ సినిమా తెరకెక్కించే అవకాశం ఉంది.

More Related Stories