English   

రేటు పెంచేసిన మహేష్ భామ !

Kriti-Sanon
2019-03-21 09:49:30

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా 'వన్ నేనొక్కడినే' అనే సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయినా నటన విషయంలో మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ. అందుకే మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ నాగ చైతన్య తో 'దోచేయ్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఇక్కడ కలిసి రాదని భావించిన ఆమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. కొన్ని అడపాదడపా సినిమాలు చేసిన తర్వాత ఈ మధ్యనే కార్తిక్ ఆర్యన్ తో 'లుకా చుప్పి' అనే సినిమాలో కనిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. ఒకరకంగా ఈ సినిమా హిట్ కావడంతో ఈమె వెంటనే తన రెమ్యునరేషన్ని పెంచేసిందని అంటున్నారు. సినిమాకు కోటి నుండి కోటిన్నర డిమాండ్ చేస్తుందట. కృతి ప్రస్తుతం కళంక్, అర్జున్ పాటియాలా, హౌస్ ఫుల్ 4, పానిపట్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ భామకి అందం, అభినయం రెండూ సమపాళ్ళలో ఉండడంతో ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్దమవుతున్నారట నిర్మాతలు. 

More Related Stories