English   

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న నితిన్.. ఆ దర్శకుడితో సాహసం !

Nithin
2019-03-21 10:14:36

ఇటీవల కాలంలో యంగ్ హీరో నితిన్ ఒకదాని తరువాత మరొకటి వరుసగా డిజాస్టర్స్ అందుకుంటూనే ఉన్నాడు. ఆయన చివరిగా నటించిన శ్రీనివాస కళ్యాణం కూడా భారీ పరాజయం పాలవ్వడంతో అప్పటి నుండి కనపడలేదు నితిన్. కొద్ది రోజుల క్రితం ఈ నెలలో రెండు సినిమాలకి సంబంధించి ప్రకటన చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అందుకు తగ్గట్టే రమేష్ వర్మతో ఒక సినిమా ప్రకటించిన నితిన్ తన రెండో సినిమా కూడా ఓకే చేసినట్టు ప్రకటించారు. ఐతే, అనుకోకుండా ఒకరోజు, మనమంతా, సాహసం వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు చంద్రశేఖర్ ఏలేటి. ఆయనతోనే నితిన్ ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించడానికి సన్నద్ధ్దమవుతున్నట్లు ప్రకటించారు. కాగా ఈ చిత్రాన్నిభవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా షూటింగ్ ఏప్రిల్ నెల మధ్యలో ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. అలా నితిన్ ఈ నెలలో రెండు సినిమాలు ప్రకటిస్తానని చెప్పి అంతే ప్రకటించాడు. అయితే ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేని ఈ దర్శకుడికి నితిన్ ఓకే చెప్పడం అంటే సాహసం చేస్తున్నట్టే. ఏమవుతుందో వేచి చూడాలి.

More Related Stories