English   

హోళీ సంబరాల్లో జాలీగా అల్లు అర్జున్ !

Allu-Arjun
2019-03-21 11:16:04

సినీ ప్రపంచంలో కాస్త గ్యాప్ దొరికినా దానిని భార్యా పిల్లలతో ఆనందంగా గడిపేసే హీరోల్లో మన అల్లు అర్జున్ ఒకరు. స్వతహాగా ఆయనది ప్రేమ వివాహం కావడంతో ఆయన తన భార్యను పిల్లలని ప్రాణంగా చూసుకుంటారు. సందర్భం ఏదైనా కానీ వారితో సంతోషంగా గడిపి ఆ క్షణాలను కెమెరాలో బందించి వాటిని త ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఈరోజు హోళీ సందర్భంగా ఆయన తన పిల్లలతో కలిసి హోళీ ఆడారు. ఆ ఆనంద సమయాన్ని క్లిక్ మనిపించి తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో వాటిని ఉంచారు. తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో పాటు ఫ్యామిలీ సభ్యులతో హోలీ పండుగును సెలబ్రేట్ చేసుకుంటూ రంగులు పూసుకున్నారు. రంగులు వెదజల్లుతూ హంగామా చేశారు.  అల్లు అర్జున్‌తో పాటు మెగా కుటుంబ స‌భ్యులు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. చిరంజీవి కూతుళ్లు సుష్మిత‌, శ్రీజ‌తో పాటు నిహారిక కూడా ఈ హోలీ సంబరాల్లో పాల్గొంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  

More Related Stories