English   

పరిటాల, దేవినేని వారసుల గురించి ట్వీట్ చేసిన మంచువారబ్బాయి !

Manchu Vishnu on Paritala Sriram and Devineni Avinash
2019-03-21 14:52:37

ఈ సారి ఏపీలో జరుగుతున్న ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి సీనియర్ నేతల వారసులు బరిలోకి దిగుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో 10 మందికి పైగా యువ నేతలు ఈసారి టికెట్లు దక్కించుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తమ తమ అదృష్టాలు పరీక్షించుకుంటున్నారు. వీరిలో మాజీ మంత్రి పరిటాల రవి కుమారుడు శ్రీరామ్‌ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ లు ఉన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీచేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నుండి అవినాష్ పోటీ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్, పరిటాల శ్రీరామ్ లను ఉద్దేశించి  సినీ హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. పరిటాల శ్రీరామ్‌, దేవినేని అవినాష్‌లను ప్రస్తావిస్తూ రాజకీయాల్లో వారి తండ్రుల స్థాయికి చేరాలని కోరుతూ వారి విజయాన్ని కాంక్షించారు. మంచు కుటుంబానికి దేవినేని, పరిటాల కుటుంబాలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతలు ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో విష్ణు వారికి ఒకేసారి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 

More Related Stories