English   

పవన్ కళ్యాణ్ ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే..

Pawan-Kalyan
2019-03-22 01:43:46

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా హీరో కాదు.. రాజకీయ నాయకుడు.. దాంతో ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయి అనే సంగతి ప్రభుత్వానికి లెక్క చెప్పాలి. దానికి తోడు ఇప్పుడు ఆయన గాజువాకలో నామినేషన్ వేసేటప్పుడు అఫిడవిట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పొందుపరిచాడు. ముఖ్యంగా ఆయన ఆస్తులు అప్పుల గురించి ముందు నుంచి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు అందరి అంచనాలకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ తన ఆస్తులతో పాటు అప్పులు కూడా ప్రభుత్వం ముందు ఉంచాడు. తనకు స్థిరాస్తులు 40 కోట్ల 20 లక్షలు ఉన్నాయని.. అలాగే చరాస్తులు 12 కోట్లు ఉన్నాయని అఫిడవిట్ లో రాశాడు పవన్ కళ్యాణ్. ఇక అప్పుల విషయానికి వస్తే దాదాపు 33 కోట్లు తాను రుణాల్లో ఉన్నట్లు చూపించాడు పవర్ స్టార్. అందులో ఎక్కువగా నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లు ఉన్నాయి. సినిమాలు చేస్తానని అడ్వాన్సులు తీసుకొని ఆ తర్వాత అవి పూర్తి చేయలేకపోయాడు జనసేనాని. రాజకీయాల్లోకి రావడంతో ఆ సినిమాలు చేస్తాడా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం అనేది కలలో మాటే. దాంతో ఆయన అప్పుడు ఇలా తీరుస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ దగ్గర అయిదున్నర కోట్లు.. వదిన కొణిదెల సురేఖ దగ్గర కోటీ 70 లక్షలు.. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర 3 కోట్లు.. హారిక హాసిని క్రియేషన్స్ దగ్గర 25 లక్షలు.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర దగ్గర 27 లక్షలు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర కోటి 70 లక్షలు.. బాలాజీ సినీ మీడియా దగ్గర రెండు కోట్లు అప్పు ఉన్నట్లు చూపించాడు పవన్ కళ్యాణ్. ఇక తన భార్య బిడ్డలు పేరుమీద 3 కోట్ల 20 లక్షల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో దాఖలు చేశాడు పవర్ స్టార్. మొత్తానికి తన దగ్గర ఎప్పుడు చూసినా డబ్బులు లేవు లేవు అని చెప్పుకుంటూ ఉండే పవన్ కళ్యాణ్ అప్పుల చిట్టా చూపించేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఏ బ్యాంకు నుంచో రుణాలు తీసుకోవడం కాకుండా కేవలం చేబదులు కింద అందరూ ఆయనకు రుణాలు ఇచ్చారు. వీటినే తనకు అప్పులుగా చూపించాడు పవన్ కళ్యాణ్.

More Related Stories