English   

మోహన్ బాబు పరోక్ష రాజకీయం....హౌస్ అరెస్ట్ !

mohan-babu
2019-03-22 03:21:48

తెలుగు సినీ నటుడు మోహన్ బాబుని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తిరుపతిలో ఉన్న ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. గత కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబు మీద సంచలన విమర్శలు చేసున సంగతి తెలిసిందే. తన కాలేజ్ కి రావాల్సిన బకాయిలని కావాలనే ఆపుతున్నారని, ఆయన అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే కాక ఆయన కుమారుడు, విద్యాసంస్థలు నడుపుతున్న విష్ణు కూడా అదే రకమైన విమర్శలు చేశారు. అయినా ఇంకా రీయంబర్స్ మెంట్  నిధులని రిలీజ్ చేయకపోవడం వలన ఆయన ఈరోజు బాబు తీరును నిరసిస్తూ ధర్నా చేయాలని ప్లాన్ చేశారు. తిరుపతిలో నిరసన ప్లాన్ చేసిన ఆయన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల నుండ తిరుపతి దాకా ర్యాలీని తలపెట్టారు. అయితే మోహన్ బాబు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే, తాను ర్యాలీని చేపట్టి తీరుతానని మోహన్ అంటున్నారు. అయితే   ఎన్నికల వేళ ర్యాలీలు, బహిరంగ నిరసనలకు అనుమతులు ఇవ్వలేమన్న పోలీసులు, ముందు జాగ్రత్తగా మోహన్ బాబుతో పాటు విద్యాసంస్థకు చెందిన మరికొంత మంది కీలక సభ్యులను గృహ నిర్భందం చేసారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై స్పందించిన మోహన్ బాబు ఎట్టిపరిస్థితిలోను నిరసన ర్యాలీని కొనసగిస్తానంటూ ప్రకటించారు. అసలే ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుతున్న వేళ మోహన్ బాబు ఇలా నిరసన ర్యాలీ చేపట్టడం ప్రతిపక్షాలకి ప్లస్సే అని చెప్పాలి. నిజానికి మోహన్ బాబు కానీ ఆయన కుటుంబం నుండి ఎవరైనా ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేస్తారని వార్తలు వినిపించాయి. కానీ అది జరగ లేదు. అయితే వైఎస్ కుటుంబంతో ఉన్న బంధుత్వం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షానికి మేలు చేసేందుకు ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పాటు పడుతున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో ?

More Related Stories