English   

చరణ్ దెబ్బకి టెన్షన్ లో మెగా ఫ్యాన్స్ !

Ram-Charan
2019-03-22 05:30:32

గత ఏడాది చిట్టిబాబు అనే క్యారెక్టర్ తో రంగస్థలం సినిమా చేసిన చరణ్, ఆ సినిమాతో తనలోని నటుణ్ణి ప్రేక్షకులకి పరిచయం చేశారు. అప్పటి దాకా చెర్రీ నటన మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా అలాంటి అన్ని విమర్సాలకి సమాధానం చెప్పింది. ఆ తర్వాత బోయపాటి డైరెక్షన్ లో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజయిన వినయ విధేయ రామ మాత్రం బెంబేలు ఎత్తించింది. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆయన జక్కన్నతో ఆర్ఆర్ఆర్ షూటింగులో బిజీగా వున్నాడు. తెలుగు స్క్రీన్ మీద బాహుబలి తర్వాత దాదాపు అంతే భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం చరణ్ వరుసగా డేట్స్ ఇచ్చాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఇదే విషయం చెప్పారు, దాదాపు ఈ ఏడాది చివరి వరకూ చరణ్ డేట్స్ ఖాళీ లేవు, అయితే చరణ్ షూట్ పార్ట్ పూర్తవ్వగానే అయన మరో సినిమా మొదలు పెట్టేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. తాజాగా ఆయన  ఓ కొత్త దర్శకుడితోసినిమా చేయబోతున్నాడని అంటున్నారు. చ‌ర‌ణ్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎస్టాబ్లిష్డ్ స్టార్ డైరెక్ట‌ర్ల‌తోనే సినిమాలు చేసాడు. అసిస్టెంట్ డైరెక్ల‌ర్ల‌తో, కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసింది లేదు. ఈ నేప‌థ్యంలో తొలిసారి ఓ యువ అసిస్టెంట్ కి పెద్ద ఛాన్స్ ఇచ్చిన‌ట్లు అయింది. గీతా ఆర్ట్స్ లో అసిస్టంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ యువకుడికి ఈ చాన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే బోయపాటి దెబ్బకి ఇమేజ్ డ్యామేజ్ అయిందని ఇలాంటి సమయంలో కొత్త వాళ్ళతో సినిమా అంటే రిస్క్ అని వారు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు.  

More Related Stories