English   

నాగ్ సరసన హీరోయిన్ ఫిక్స్ !

Rakul-Preet
2019-03-22 05:36:34

గత ఏడాది రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన నాగార్జున, ఆ రెండు సినిమాలు హిట్ కాకపోవడంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే కొత్త ప్రయోగాలకి తావివ్వకుండా తనకు అచ్చొచ్చిన జానర్స్ ని ఎంచుకోవాలని చూస్తున్నాడు. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 రూపొందనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ సినిమా ఈ నెలాఖరు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. అయిథ్వ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రకుల్ ని సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం వెంకీమామ సినిమాలో చైతూ జోడీగా ఎంపికైన రకుల్, మన్మథుడు 2 కోసం ఆ సినిమాను వదిలేసుకుందనే టాక్ వచ్చింది. అయితే మన్మథుడు 2 సినిమా కోసం ఆమెను తీసుకున్నారా లేదా అనే విషయం అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి దాని మీద క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఆమెను ఈ సినిమాలో కథానాయికగా ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాలో న‌టించేందుకు గానూ గట్టిగానే రెమ్యున‌రేష‌న్ అడుగుతోందట ర‌కుల్. అయినా నిర్మాతలు వెనకాడక ఆమెనే ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో అయినా నాగ్ హిట్ కోడతాడేమో ? 

More Related Stories