English   

బాలకృష్ణ-రాజశేఖర్ ల మల్టీ స్టారర్...ఆ రీమేకా ?

Balakrishna
2019-03-22 07:09:57

మన సినీ పరిశ్రమలో రీమేక్స్ కొత్త కాదు, ఏ భాషలో అయినా ఒక సినిమా మంచి హిట్ కొడితే మిగతా బాషల వాళ్ళు ఆ సినిమా మీద ఇంటరెస్ట్ చూపడం సహజం. తాజాగా ఒక తమిళ సూపర్ హిట్ సినిమాని తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన వాళ్ళు. తాజాగా నందమూరి బాలకృష్ణ తమిళంలో హిట్టైన విక్రమ్ వేదను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్‌ లో బాలకృష్ణతో పాటు రాజశేఖర్ మరో హీరోగా నటిస్తున్నాడని అంటున్నారు. 2017 జూలై 21న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన విక్ర‌మ్ వేద‌లో మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి సూపర్ హిట్ అందుకున్నారు. తమిళ్ లో ఈ సినిమాని పుష్క‌ర్ – గాయ‌త్రి తెర‌కెక్కించారు. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతిలు చేసిన ఈ క్యారెక్టర్స్‌ను తెలుగులో బాలకృష్ణ, రాజశేఖర్‌ లలో ఎవరు చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే తమిళ్ వర్షన్ తెరకెక్కించిన వారే తలుగులో కూడా ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్నికల హడావుడిలో ఉన్నాడు. అవి పూర్తయ్యాక బోయపాటి సినిమా ఉంటుందని అంటున్నారు, రాజశేఖర్ ఆ ఫేం ప్రశాంత్ వర్మతో కల్కి సినిమాలో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకేక్కుతుందనేది చూడాలి. 

More Related Stories