English   

అల్లు అర్జున్ కి తల్లి కాబోతున్న సీనియర్ హీరోయిన్ !

Tabu
2019-03-22 09:12:08

అరవింద సమేత హిట్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రకటించలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ప్రకటించారు. అల్లు అరవింద్, చినబాబులు ఈ సినిమా నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని తెలుస్తోంది. స్క్రిప్ట్ సిద్ధం చేసి నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ తల్లి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబును తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హిందీలో మాత్రమే ఆమె సినిమాలు చేస్తోంది. అయితే ఆమె సీట్ ఫిఫ్టీస్ లోకి వచ్చేసినా ఆమె ఇంకా అవివాహితే, ఇంకా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. ఈ నీపధ్యంలో ఆమె త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెబుతుందో లేదో చూడాలి. ఆమె చివరిగా తెలుగులో అబ్బాస్ తో కలిసి ఇదీ సంగతి అనే సినిమాలో అబ్బాస్ వైఫ్ గా నటించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో నటిస్తోంది కానీ తెలుగులోకి రాలేదు. ఈ సినిమా ఒప్పుకుంటే మంచి కం బ్యాక్ అయినట్టే. ఇకపోతే బన్నీ ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్నాడు. ఇక ఈ సినిమాలో అరవింద సమేతలో నటించిన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.

More Related Stories