English   

అక్కడ తొలి సినిమాతోనే ప్రయోగం చేస్తున్న కీర్తి సురేష్..

Keerthy-Suresh
2019-03-22 10:02:58

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ అంటే కచ్చితంగా ఏదో కొత్తగా ప్రయత్నిస్తుంది అనే ఒక ముద్ర పడిపోయింది. ఆ ఇమేజ్ పోకుండా ఉండాలనే మహానటి తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు కీర్తి సురేష్. మళ్లీ అలాంటి అద్భుతమైన స్క్రిప్టు వచ్చినప్పుడు తెలుగులో సినిమా చేస్తాను అంటోంది ఈ ముద్దుగుమ్మ. తమిళనాట కూడా కీర్తి సురేష్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇక ఇలాంటి సమయంలో బాలీవుడ్ నుంచి ఆమెకు ఒక అరుదైన అవకాశం వచ్చింది. బదాయి హో లాంటి సినిమా తెరకెక్కించిన అమిత్ శర్మ ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో టైటిల్ రోల్ అజయ్ దేవగన్ చేస్తుంటే ఆయన భార్య పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ పాత్ర ప్రయోగాత్మకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో రెండు రకాల వయసున్న పాత్రలో కీర్తి సురేష్ నటించబోతుంది. ముందుగా యుక్త వయసులో ఉన్న భార్య పాత్ర అయితే.. ఆ తర్వాత వయసు మళ్ళిన పాత్ర కూడా ఒకటి ఉంది. ఈ పెద్దావిడ పాత్ర కోసం మేకప్ లేకుండా నాచురల్ గా ప్రయత్నించడానికి కీర్తి సురేష్ ముందడుగు వేస్తోంది. ఆ లుక్కు రావడానికి తాను ట్రై చేస్తానని దర్శకుడు అమిత్ శర్మకు కీర్తి సురేష్ చెబుతుందని తెలుస్తోంది. బాలీవుడ్లో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాలని ఆరాటపడుతుంది కీర్తి సురేష్. అయితే సౌత్ ముద్దుగుమ్మలకు బాలీవుడ్ సినిమా పెద్దగా కలిసి రాలేదు. అక్కడ విజయం సాధించినా కూడా అవకాశాలు మాత్రం రావు. ఈ విషయం తెలిసి కూడా కీర్తి సురేష్ తన పాత్ర బాగుందని అజయ్ దేవగన్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. మరి ఈమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి. పైగా తొలి సినిమాలోనే ప్రయోగాత్మక ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.

More Related Stories