English   

మా కొత్త ప్యానెల్ లో కూడా లుకలుకలు !

Rajasekhar
2019-03-22 11:18:21

ఎట్టకేలకు కొట్టుకునో తిట్టుకునో మా అసోసియేషన్ ఎన్నికలు పూర్తి కాగా నరేష్ ప్యానెల్ గెలిచింది. అక్కడి వరకూ బాగానే ఉన్నా మళ్ళీ మరో కొత్త రచ్చ మొదలైంది. మొన్నటి వరకూ నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్స్ మధ్య కోల్డ్ వార్ జరిగితే ఇప్పుడు నరేష్ ప్యానెల్ లోనే విభేదాలు బయట పడ్డాయి. అనేక వివాదాల నడుమ ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ గా నరేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రామానికి కొత్తగా ఎన్నికైన ‘మా’ సభ్యులతో పాటు సూపర్ స్టార్ క్రిష్ణ, విజయ నిర్మల, క్రిష్ణంరాజు, కోటా శ్రీనివాసరావు, మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నరేష్ ప్యానల్ తరుపున శ్రీకాంత్‌పై గెలిచిన రాజశేఖర్ కొత్త ప్రెసిడెంట్ నరేష్‌పై అసహనం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అదలా ఉంచితే నరేష్ కి సొంత వర్గం నుండే నిరసన ఎదురయ్యింది. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నరేష్ మాట్లాడుతూ పలు సందర్భాల్లో నా అంటూ మాట్లాడారు. దీంతో ప్యానల్ అందరం కలిసికట్టుగా కష్టపడి గెలిస్తే నరేష్ ఒక్కరే గెలిచినట్టు ఫీల్ కావడాన్ని రాజశేఖర్ తప్పుపట్టారు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్టాడాలని నేను నా అని కాకుండా మనం మా అంటూ అందరికీ మంచిదని వేదికపైనే నరేష్‌ కి చుక్కలు చూపించారు.

అనంతరం ఇండిపెండెంట్‌ గా గెలిచి ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన హేమ మాట్లాడేందుకు మైక్ తీసుకుంటే వెంటనే మాట్లాడుతున్న సందర్భంలో నరేష్ ఆమె మైక్ లాక్కోవడం మీద ఆమె ఫైర్ అయింది. మళ్ళీ జీవిత నుండి మైక్ తీసుకున్న హేమ నేను అందరి తరుపున మాట్లాడుతున్నాను. మైక్ లాక్కోవడం ఏంటి? ఇదేనా పద్ధతి అంటూ అసహనం వ్యక్తం చేశారు.  అనంతరం మాట్లాడిన హేమ నరేష్ ఇప్పటివరకూ చెప్పినవి మా ఈసీలో ఎవర్నీ సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలేనని మా అసోసియేషన్‌లో 26 మంది ఒక్కటేనని అందరి నిర్ణయాలు తీసుకున్న తరువాత జనరల్ బాడీకి వెళ్లాక డెసిషన్ తీసుకోవాలి. ఇది నా ఒక్క అభిప్రాయమే కాదు గెలిచిన అందరి సభ్యుల తరుపున చెప్తున్నానని ఇదేం బాలేదు నరేష్ గారూ మీ పద్దతి నచ్చలేదు.  సారీ అంటూ ఆమె నిరసన వ్యక్తం చేశారు.

More Related Stories