English   

తెలుగు విక్రం వేధా గురించి అధికారిక ప్రకటన చేసిన వైనాట్ స్టూడియోస్ !

Balakrishna and Rajasekhar to act in Telugu remake of Vikram Vedha
2019-03-22 13:10:42

నిన్నటి నుండి నందమూరి బాలకృష్ణతో కలిసి హీరో రాజ శేఖర్ లు తమిళ సూపర్ హిట్ సినిమా విక్రం వేధాని రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఎవరు రాశారో తెలీదు కానీ మిగతా అందరూ అదే దారిలో కధనాలు వండి వార్చారు. అయితే ఇందులో నిజం లేదట, ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, ఆ సినిమా రీమేక్ హక్కులు కొన్న వైనాట్ స్టూడియోస్ వాళ్ళు. నిన్నటి నుండి ప్రచారం జరుగుతున్నట్టు తాము రీమేక్ హక్కులు కొన్న సినిమా ఎవరూ తీయడం లేదని, ఇంకా దాని గురించి ఎవరూ తమను సంప్రదించలేదని వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. అలా కధనాలు వండి వార్చే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోమని కూడా వారు మీడియాకి విజ్ఞప్తి చేశారు. తాము అధికారిక ప్రకటన చేసే దాకా ఇలాంటివి వండి వార్చద్దని వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

More Related Stories