English   

తెలంగాణా మీద పవన్ కామెంట్..కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ !

KTR
2019-03-23 01:24:47

ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది, ఇప్పటికే నామినేషన్ పర్వం ముగుస్తుండగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపధ్యంలో నిన్న ఒక ప్రచార సభలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణకు వెళ్తే ఆంధ్రా వాళ్లను కొడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. మీరు చేసిన వ్యాఖ్యలు మీ ఆలోచనలకు సరికాదని తెలియచేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 29 రాష్ట్రాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి సొంత ఇంట్లో ఉంటున్నట్టు తెలంగాణలో ఉంటున్నారనే విషయం మీకు తెలుసని ఆయన ట్వీట్ చేశారు. మీరు నా అభిప్రాయంతో తప్పకుండా ఏకీభవిస్తారని నాకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరంగా వ్యతిరేకతను పెంచుతాయని పవన్‌ కి కేటీఆర్ సూచించారు. అయితే మరో పక్క పవన్ కళ్యాణ్ అలా మాట్లాడలేదని, కావాలంటే వీడియో చూడాలని జనసేన సోషల్ మీడియా వారు వివరణలు ఇచ్చుకుంటున్నారు. 

More Related Stories