English   

చెన్నైలో శ్రీ రెడ్డి మీద ఎటాక్...అంతా మిస్టరీ !

Sri-Reddy
2019-03-23 02:30:54

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి మరో మారు వార్తల్లోకి ఎక్కింది. చాలా రోజులు క్రితమే శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చిన సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలో ఆమె తనపై దాడి జరిగినట్టు నటి శ్రీరెడ్డి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళ సినీ నిర్మాత సుబ్రమణి, ఆయన అసిస్టెంట్ గోపి ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చెన్నైలోని కోయంబేడు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ లో మాత్రం వేరేగా ప్రకటించిది ఈ నటి.  తమిళనాడులో పొలాచ్చి సెక్స్ రాకెట్ వ్యవహారం సంచలనం రేకెత్తించగా ఆ విషయం మీద తను స్పందించడం వల్లే ఈ దాడి జరిగిందని పేర్కొంది. అయితే ఫేస్ బుక్ లో మాత్రం తనపై ఎవరు దాడిచేశారనే విషయం ఆమె వెల్లడించలేదు. శ్రీరెడ్డిపై దాడికి పొలాచ్చి సెక్స్ రాకెట్ వ్యవహారమే కారణమైతే పోలీసులకు సుబ్రమణి తనపై దాడిచేశాడని ఆమె ఎందుకు ఫిర్యాదు చేశారనేది మిస్టరీగా మారింది. అయితే ఇవి రెండూ వేర్వేరు విషయాలా ? అలా అయితే ఆమె మీద వేరే వాళ్ళు దాడి చేస్తే ఆమె ఎందుకు ఊరుకుంది అనేది ప్రస్నార్దకాలుగా మారాయి. దీని మీద ఆమె నోరు విప్పితే కానీ మరింత క్లారిటీ రాదు.

More Related Stories