English   

మహేష్ ఫ్యాన్స్ కి దేవి శ్రీ గుడ్ న్యూస్ !

Maharshi
2019-03-23 04:29:02

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం మహర్షి. దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. చివరికి మే తొమ్మిదో తారీఖున విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకుంది. సినిమా విడుదలకు ఇంకా 50 రోజులు టైం ఉండటంతో మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి కేవలం ఫస్ట్ లుక్ అలాగే టీజర్ మాత్రమే రిలీజ్ అవ్వడం మినహా ఇంకీమీ రాకపోవడం వలన మిగిలిన అప్డేట్స్ కోసం వారు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే వారికి సంతోషాన్ని కలిగించేలా ఈరోజు ఆ చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఒక ప్రకటన చేశారు. మహర్షి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అందరికీ శుభవార్త అంటూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటన ప్రకారం ఈనెల 29వ తారీఖున మహర్షి సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. అందాక మహేష్ అలాగే వంశీ పైడిపల్లి కూతుర్లతో కలిసి దేవి శ్రీ ప్రసాద్ పాడిన శ్రీమంతుడు సాంగ్ ని ఎంజాయ్ చేయండి అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసెయ్యండి మరి.
 

More Related Stories