English   

అర్జున్ సురవరం మళ్ళీ వెనక్కి వెళ్ళాడు !

Nikhil
2019-03-23 08:49:54

నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అర్జున్‌ సురవరం. తమిళ్ కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందుగా ముద్ర అనే టైటిల్‌ ను నిర్ణయించారు. అయితే కానీ శ్రీకాంత్ హీరోగా అదే పేరుతో ఓ సినిమా ఇటీవల రిలీజ్ కావటంతో నిఖిల్ సినిమాకు టైటిల్‌కు మార్చక తప్పలేదు. అయితే అదే ఎఫెక్ట్ తో రిలీజ్ చేస్తే ఇబ్బంది పడతారేమో అని సినిమా విడుదల డేట్ మార్చారు. అయితే ఈ సినిమాకి రిలీజ్‌ విషయంలో మళ్ళీ ఇబ్బందులు తప్పటం లేదు. మార్చి 29న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ఇంతకు ముందు ప్రకటించారు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ టైంలో రిలీజ్ చేస్తే వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాని మే 1న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అర్జున్ సురవరం టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. అందుతున్న సమాచారం మేరకు అర్జున్ సురవరం నైజామ్ హక్కులను ఏషియన్ సునీల్ 4 కోట్ల రూపాయలకు డీల్ చేసుకున్నట్టు తెలిసింది. ఇది నిఖిల్ కెరీర్ లో హయ్యెస్ట్. చూడాలి మరి ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో.

More Related Stories