English   

వెంకీ కూతురి పెళ్లి...రహస్యంగా ?

Venkatesh
2019-03-23 09:34:16

టాలీవుడ్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు కూతురు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంటకి త్వరలోనే పెళ్లి కానుంది. దగ్గుబాటి కుటుంబంలో నాగచైతన్య సమంతల పెళ్లి తర్వాత ఇదే శుభకార్యం కావడంతో ఆ కుటుంబ సభ్యులందరూ పెళ్లి వేడుకల్లో మునిగిపోయారు. వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ప్రేమలో పడగా విషయం పెద్దలకి చెప్పి అందరినీ ఒప్పించి వివాహం చేసుకుంటున్నారు. అయితే ఈ విషయం మీద అధికారికంగా దగ్గుబాటి కుటుంబం  ఇప్పటివరకూ స్పందించక పోయినా ఆ విషయాలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి. పెళ్లి వేడుకల కోసం ఇరు కుటుంబ సభ్యులు శుక్రవారం రాజస్తాన్ లోని జైపూర్ చేరుకున్నారు. రేపు పెళ్లి జరగనుండగా ఈ రోజు ప్రీ వెడ్డింగ్ జరుగుతోంది. అయితే ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా వెంకటేష్, రానా, సల్మాన్ ఖాన్ లు కలిసి ఉన్న ఫోటో ఒకటి బయట పడడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే పెళ్లి జైపూర్ లో జరుగుతుండగా రిసెప్షన్ హైదరాబాద్ లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

More Related Stories