English   

శిరీష్ వద్దన్న సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ !

Kalyan-Ram
2019-03-23 09:58:42

అల్లు శిరీష్, కళ్యాణ్ రామ్ వీరిద్దరూ కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన నటులే. కానీ ఇద్దరికీ పెద్దగా హిట్స్ లేవు. అయితే కెరీర్ పరంగా కళ్యాణ్ సీనియర్ కావడంతో ఆయనకు చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. అతనొక్కడే, హరే రామ్ , పటాస్ అలాగే ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన 118 సినిమాలు ఆయనకు కెరీర్ పరంగా బెస్ట్ సినిమాలు. శిరీష్ విషయానికి వస్తే దగ్గర మూడు నాలుగు సినిమాలు చేసినా క్షణం సినిమా దాదాపు చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేదు. ప్రస్తుతం ఆయన మలయాళ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఏబీసీడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. అయితే కొత్త దర్శకుడు వేణు అల్లు శిరీష్‌ని క‌లిసి ఫాంట‌సీ స‌బ్జెక్ట్‌ ఒకటి చెప్పాడట. అయితే క‌థ నచ్చిన‌ప్ప‌టికి భారీ బ‌డ్జెట్ అవుతుంద‌ని, తన మార్కెట్ కి అది సూట్ కాదనే భావ‌న‌లో ఆ ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు నో చెప్పాడ‌ట‌ శిరీష్ . అయితే వేణు అదే క‌థ‌ని క‌ళ్యాణ్ రామ్‌కి వివ‌రించ‌గా, ఆయ‌న తన సొంత బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ లోనే ఈ ఫాంట‌సీ బేస్డ్ సినిమాని నిర్మించాల‌ని ఫిక్స్ అయ్యాడట. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి తుగ్ల‌క్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారని ఫిలిం నగర్ టాక్.  

More Related Stories