English   

నాగబాబుకు అండగా జబర్దస్త్ కమెడియన్.. హైపర్ ఆది ప్రచారం..

Hyper-Aadhi
2019-03-23 10:48:38

నాగబాబు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిపోయాడు. తమ్ముడు జనసేన పార్టీ నుంచి నరసాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈయనకు అక్కడ గట్టి పోటీ ఉంది. మిగిలిన రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రఘురామ కృష్ణంరాజు.. తెలుగుదేశం పార్టీ నుంచి శివరామరాజు నరసాపురం నుంచి లోక్ సభ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు నాగబాబు కూడా తోడు కావడంతో త్రిముఖ పోరు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం వైసీపీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దాంతో నాగబాబు కూడా తన గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి తమ్ముడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కచ్చితంగా లోక్సభ స్థానం గెలుచుకుంటామని ధీమా చెబుతున్నాడు మెగా బ్రదర్. ఇక ఇప్పుడు ఈయనకు తోడుగా ప్రచారం చేయడానికి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా వస్తున్నాడు. తనకు లైఫ్ ఇచ్చిన నాగబాబు గారి కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా అంటున్నాడు ఈ కుర్ర కమెడియన్. నాగబాబు లాంటి మంచి వ్యక్తిని గెలిపించుకొనే బాధ్యత నరసాపురం ప్రజలపై ఉంది అంటూ గుర్తు చేస్తున్నాడు. దానికి తోడు ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా జనసేన గెలవడమే కాకుండా రాజకీయాల్లో మార్పు రావడం ఖాయం అంటున్నాడు హైపర్ ఆది. ఓటు వేసేటప్పుడు అందరూ గ్లాసును గుర్తు పెట్టుకొని మరి బ్యాలెట్ బాక్స్ పై దండయాత్ర చేయండి అంటున్నాడు ఆది. కచ్చితంగా తాను కూడా వచ్చి నాగబాబుకు సపోర్ట్ చేసి ఆయనను గెలిపించడంలో తన వంతు పాత్ర పోషిస్తానని అంటున్నాడు హైపర్ ఆది. మరి ఈయన చేసే ప్రచారం నరసాపురంలో నాగబాబుకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

More Related Stories