English   

పవన్ కళ్యాణ్ మీద పోసాని సంచలన వ్యాఖ్యలు !

Posani-Krishna-Murali
2019-03-23 11:24:09

తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న  భీమవరంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలని నటుడు పోసాని కృష్ణమురళి తప్పుపట్టారు. ఈ విషయం మీద సెపరేట్ గా మీడియా సమావేశం నిర్వహించిన పోసాని పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  ఓట్ల కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగ‌జారి మాట్లాడడం స‌బ‌బు కాద‌ని తెలంగాణ‌లో ఆంధ్రావారికి ఎవ‌రికీ భ‌యం లేదు, మీరు ఇలాంటి మాట‌లు మాట్లాడి ప్రశాంత వాతావ‌ర‌ణం చెడగొట్టొద్దని అన్నారు.  తెలంగాణ ప్రజలు దేవుళ్ళ లాంటి మనుషులని, వాళ్ళు మన ఇంటికి వస్తే చాయ్ తాగిస్తేనే ఎంతో సంతోషిస్తారని అలాంటి మంచి మనుషుల గురించి ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడతారని పోసాని ప్రశ్నించాడు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నది ఎవరు..? గొప్ప ముఖ్యమంత్రి అని పొగిడింది ఎవరో? చెప్పాలని పోసాని ఎద్దేవా చేశారు.  ఎవరిని కొట్టారో, ఒక్కరినైనా చూపించగలవా పవన్ అంటూ నిలదీశారు. పోనీ కొడుతున్నప్పుడు అడ్డుకున్నావా, ఎవరినైనా పరామర్శించావా అని ప్రశ్నించారు. ఎవరినైనా కేసీఆర్ కొట్టారు అని నిరూపించగలవా అంటూ పోసాని ప్రశ్నించారు.  తెలుగు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోసాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వలలో పడ్డారని పోసాని కృష్ణమురళీ ఆరోపించారు. 

More Related Stories