English   

కారు డిక్కీలో పవన్...మీరూ చూడండి !

Janasena Chief Pawan Kalyan rests in his car during his campaign
2019-03-23 14:11:13

2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పటి పరిస్థితుల్లో బిజెపి టిడిపి కూటమి సరైందని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని భావించి ఆయన వాటికి మద్దతు తెలిపారు. అయితే ఆ రెండు పార్టీలు కొట్టుకోవడమే కాక ఏపీకి కూడా అన్యాయం చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఆయన వామపక్షాలు అలాగీ బహుజన్ సమాజ్ వాడీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిన్నా మొన్నా రెండ్రోజుల్లో రెండు చోట్ల నామినేషన్ వేసిన పవన్ కూడా తన స్పీడ్ పెంచుతున్నారు. ఈరోజు పర్యటనలో అలిసిపోయిన ఆయన తన కారులో సేదతీరుతూ కెమెరా కంటికి చిక్కారు. తమ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసులో టీ తాగుతూ ఆయన సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చుసిన పవన్ అభిమానులు జనసేన నాయకులు పవన్ సింప్లిసిటీ గురించి పోస్టులు పెడుతున్నారు. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి మరి.

More Related Stories