English   

ఐపీఎల్ మ్యాచ్‌ లో ర‌జ‌నీకాంత్ సంద‌డి !

Superstar Rajinikanth arrives during Dhoni’s Chennai Super Kings match at Chepauk
2019-03-24 08:58:44

ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు నిన్నటి నుండి మొదలయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మధ్య జరిగింది. అయితే చెన్నై వేదిక‌గా జ‌రిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో తమిళ తలైవా ర‌జ‌నీకాంత్ సంద‌డి చేశారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ కి హాజ‌రైన ర‌జ‌నీ అభిమానుల మ‌ధ్య కూర్చొని మ్యాచ్‌ ని ఎంజాయ్ చేశారు. నిన్నటి నుండి ఐపీఎల్ ఒక ఎత్తు అయితే రజనీకాంత్ ఫోటోలు ఓక ఎత్తు లాగా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఆయన సిప్ర‌స్తుతం మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. పొలిటికల్ బేస్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా ఇందులో రజనీ కనిపించనున్నాడు అని అంటున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాని నిర్మించ‌నుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు.

More Related Stories