English   

ఘనంగా వెంకటేష్ కుమార్తె వివాహం

Venkatesh's daughter wedding
2019-03-24 09:14:30

టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్ లోని ఓ హోటల్‌ లో ఆశ్రిత, హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్‌ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు.  పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను రాంచరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ లో షేర్‌ చేశారు. ఈ వేడుకకు రామ్‌చరణ్‌, ఉపాసన, నాగచైతన్య, సమంత, సల్మాన్‌ ఖాన్‌ తదితర సినీ ,ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక హైదరబాదులోని సినీ ప్రముఖుల కోసం దగ్గుబాటి ఫ్యామిలీ త్వరలో హైదరాబాద్‌లో రిసెప‍్షన్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి సామాజిక వర్గాలు వేరయినా వెంకటేష్ సతీమణి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితోనే కూతురి వివాహం కూడా జరిగింది.

More Related Stories