English   

సూసైడే శరణ్యం అంటున్న బాలీవుడ్ హీరో...ట్వీట్ ల కలకలం !

Uday Chopra shares cryptic tweets hinting at suicide ,Uday Chopra's cryptic tweets about depression and suicide leave fans concerned
2019-03-24 13:08:25

బాలీవుడ్ హీరో ప్రముఖ నిర్మాత యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా చేసిన ట్వీట్లు షాక్‌కు గురిచేశాయి. తాను చావుకు దగ్గరయ్యాయని ఇక ఆత్మహత్య చేసుకోవడమే మిగిలిందని తాజాగా ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకం రేగింది. ధూమ్ సిరీస్ తోపాటు మరికొన్ని సినిమాల్లో నటించిన ఈయనకి ఏమైందని జనాలు ఆరాలు తీస్తున్నారు. ఆయన పెట్టిన ట్వీట్ లు వెంటనే తొలగించినా  నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీయడంతో ట్వీట్ వైరల్ అయింది. ఆయన ట్వీట్ స్ ప్రకారం
ట్వీట్ 1
నీవు ఆరాధించే దేవడిని నమ్ముతూ నా తలపై గన్ గురిపెట్టవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అది తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదు. నా మనసులో ఉన్నది మీకెవ్వరికీ తెలియదు. అది భగవంతుడికి మాత్రమే తెలుసు అంటూ ఉదయ్ చోప్రా ట్వీట్ చేశాడు.
 
ట్వీట్ 2
‘చావుకి నేను చాలా దగ్గరైనట్లు అనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే స‌రైన స‌మ‌యం అనిపిస్తోంది. త్వరలోనే దాన్ని నిజం చేస్తానేమో’ అంటూ ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. ఉదయ్ చోప్రా ట్వీట్లు చూసి అభిమానులు ఖంగుతిన్నారు.

ట్వీట్ 3
‘ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు. చాలా ప్రయత్నిస్తున్నా.. కానీ, విఫలమవుతున్నా.. కొన్ని గంట‌ల పాటు నా ట్విటర్ అకౌంట్‌ను డీ-యాక్టివేట్ చేశా..’ అంటూ ఉదయ్ చోప్రా మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్స్ చూసిన కొంత మంది అభిమానులు ఆయ‌న ఆలోచ‌న‌ల‌ను మార్చే ప్రయత్నం చేశారు. ఆయనకు ధైర్యం చెబుతూ చాలా మంది ట్వీట్లు చేశారు. అయితే.. ఉద‌య్ తాను చేసిన ట్వీట్లను కొద్ది నిమిషాల తర్వాతే డిలీట్‌ చేశారు. కానీ, కొంత మంది వాటిని అప్పటికే స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

More Related Stories