English   

మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

Mahesh Babu to unveiled his Wax statue tomorrow
2019-03-24 13:29:31

ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మహేష్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దక్షిణాది హీరోల్లో ప్రభాస్ తర్వాత ఆ ఘనత సాధించింది మన మహేశ్ మాత్రమే. అయితే ఎక్కడో సింగపూర్‌ మ్యూజియంలో మహేష్ విగ్రహం పెడితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్లి ఆ విగ్రహాన్ని చూడటం అంటే అందరికీ కుదిరే పని కాదు. అందుకే మహేష్ అభిమానులు సహా తెలుగు ప్రజల సౌకర్యార్దం ఈ విగ్రహాన్ని రేపు హైదరాబాద్ తీసుకురానున్నారు.  హైదరాబాద్ గచ్చీబౌలిలోని మహేష్ బాబుకు చెందిన నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎంబి సినిమాస్ వేదికగా తన మైనపు విగ్రహాన్ని మహేష్ లాంచ్ చేయనున్నాడు. అనంతరం ఈ విగ్రహాన్ని ఒక రోజు పాటు ప్రజల సౌకర్యార్ధం ప్రదర్శనకు ఉంచనున్నారు. తరువాత సింగపూర్ తరలించి అక్కడి మ్యూజియంలో ఉంచనున్నారు. ఇలా ఒక విగ్రహం బయటి దేశంలో ఆవిష్కరించడం ఇదే తొలిసారి అలా చేసిన ఘనత మహేశ్ కే దక్కనుంది. దీని కొస సెల్ఫీ కాంటెస్ట్ లు కూడా నడిపారు, దాని ప్రకారం మైనపు బొమ్మతో పాటు నిజమైన మహేష్ తో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. మరి ఆ అదృష్టవంతులు ఎవరో మరి.

More Related Stories