English   

ఎన్నికల్లో జిగేల్ మంటున్న సినీ గ్లామర్ !

comedian ali and hero tanish campaigning for ysrcp in kurnool district
2019-03-24 14:15:51

ఏపీ ఎన్నికల్లో సినీ గ్లామర్ తళుకులీనుతోంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ వంటి నటులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుండగా మరి కొందరు ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీల కోసం ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో ఈ సినీ గ్లామర్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున కమెడియన్ అలీ, హీరో తనీష్ రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూన్న వారు లోకల్ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. పొద్దున్నే మొదలెట్టి అర్థరాత్రి వరకు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తున్నారు. వీరికి తోడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా ప్రచారంలో బిజీ అయ్యారు. ఇక ఎటూ పోసాని, పృధ్వీ, కృష్ణుడు, విజయ్ చందర్, భాను చందర్  లాంటి నటులు ఉండనే ఉన్నారు. వీరిని కూడా జగన్ రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సినీ గ్లామర్ ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకుంటుందో ఎంత వరకు ఓట్లు రాలుస్తుందో చూడాలి మరి.

More Related Stories