English   

భలే ఇన్ డైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తున్నారుగా !

Chitralahari Movie GLASSMATES Song
2019-03-24 14:47:00

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలకి సినీ ఇండస్ట్రీతో సంబంధం ఏర్పడుతోంది. దానికి కారణం టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగడం. పార్టీ పెట్టి ఐదేళ్లయినా స్తబ్దుగా ఉన్న పవన్ 2019లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించాడు. అందుకు తగ్గట్లుగానే త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌కటించాడు. తాను కూడా రెండు నియోజిక వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌కటించాడు. భీమ‌వ‌రం, గాజువాక నియోజిక వ‌ర్గాల నుంచి ఆయ‌న పోటీ చేస్తున్నారు. అయితే రాజకేయం మొదలు పెట్టిన నాటి నుండి ప‌వ‌న్ కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు. కాని ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మయంలో ప‌వ‌న్‌కు మెగా ఫ్యామిలీ అండ‌గా నిలిచింది. ఇటీవ‌లే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పార్టీలో చేర‌డ‌మే కాక, పార్టీ త‌రపున న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్థిగా పోటీలో ఉన్నారు. ఇప్పుడు మెగా హీరోలు కూడా ప‌వ‌న్‌ కి ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ ప‌వ‌న్ పార్టీ గుర్తు గ్లాస్‌ను ప‌ట్టుకుని ఓ ఫోజు ఇచ్చాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్ర లహరి సినిమాలో గ్లాస్‌మేట్స్‌ అనే సాంగ్ ఉంది. కొద్ది సేపటి క్రితం ఆ సాంగ్ రిలీజ్ చేశారు. దానికి సంబంధిన పోస్టర్ లో సేమ్ జనసేన గాజు గుర్తును ఉంచి మరీ ఇన్ డైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తున్నాడు మనోడు.

More Related Stories