English   

నారా లోకేష్ మీద తమన్నా పోటీ !

|tamanna simhadri contest in mangalagiri
2019-03-25 09:12:57

ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్ బరిలోకి దిగుతున్న మంగళగిరి శాసన సభ స్థానం హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఇప్పటి వరకూ లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయకపోవడమే. ఆయనకు పోటీగా వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామ కృష్ణా రెడ్డి ఉన్నాడు. లోకేష్ ని ఎలాగైనా ఓడిస్తానని సవాల్ విసిరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ మేరకు గట్టిగానే కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ లోకేష్ కే విజయావకాశాలు ఎక్కువని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఈ స్థానం నుండి జనసేన తన అభ్యర్ధిని నిలబెట్టలేదు. ఈ సీటును మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది. ఈ క్రమంలో ఇక్కడ నుండి జనసేన రెబల్ ఒకరు పోటీ చేయడానికి సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఇక్కడి నుంచి ట్రాన్స్‌జెండర్ అయిన తమన్నా సింహాద్రి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈమేరకు ఉదయం 11.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఈమె శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ సమయంలో అందరికీ తెలుసు, అవనిగడ్డ వైసీపీ క్యాండిడేట్ తన బాబాయ్ అని చెప్పుకునే ఈమె, ఈ మధ్య జనసేనలో యాక్టివ్ అయ్యారు, అయితే ఆమె జనసేన రెబల్ గా పోటీ చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

More Related Stories