English   

జగన్ ని ఉద్దేశిస్తూ మంచి విష్ణు భార్య ట్వీట్ !

manchu vishnu wife write tweet on  ys jagan
2019-03-25 10:17:05

వైసీపీ అధినేత జగన్ కి సినీ హీరో మంచు విష్ణు భార్య వెరోనికా చెల్లెలు అవుతుందన్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలి ముంచుకొస్తున్న తరుణంలో ఆమె చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఒక పక్క మంచు వర్సెస్ టీడీపీ అన్నట్టు వ్యవహారం నడుస్తున్న సందర్భంలో ఆమె చేసిన ట్వీట్ కీలకలంగా మారింది. ఆమె చేసిన ట్వీట్ యధాతదంగా ‘నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నానని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అసలు నేనెందుకు మద్దతివ్వకూడదు ? ఒకవేళ మీకు దీనిపై స్పష్టత లేకపోతే, మీకు కొన్ని విషయాలు చెబుతాను. వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం. ఇక నా విషయానికి వస్తే, నాకెప్పుడూ నా కుటుంబమే తొలి ప్రాధాన్యత’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  ఫీజు రీయంబర్స్ మెంట్ విషయంలో మోహన్ బాబు రోడ్డెక్కారు, ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అయన బాబు మీద విరుచుకుపడ్డారు, అయితే జగన్  బంధువు కావడం వలెనే ఆయన బాబుకు వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో ఇలా చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

More Related Stories