English   

సుకుమార్ మద్దతు కోసం పార్టీల తంటాలు !

tdp and janasena mla candidates went to director sukumar house in east godavari
2019-03-25 10:33:53

ఏపీలో ఎన్నికల డేట్ దగ్గర కోస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజే ఎన్నికల నామినేషన్ కి చివరి రోజు. ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యేలు, ఏమ్పీలుగా పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. తమ పార్టీకే ఓటేయాలని అందరినీ కోరుతూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తమ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులను కూడా కలుస్తూ వారిని తమకి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరయిన సుకుమార్ మద్దతు కోసం తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఇంటికి వెళ్లి మరీ కలిసి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు గ్రామం రాజోలు నియోజవర్గం పరిధిలోకి వస్తుంది. సుకుమార్ తన స్వగ్రామంలోనే ఉన్నారన్న విషయం తెలుసుకున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు ఆయన ఇంటికి వెళ్లి మద్దతివ్వాలని కోరారు. రాజోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్లపల్లి సూర్యారావు, జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు నిన్న సుకుమార్ ఇంటికి వేర్వేరుగా వెళ్లి ఆయన్ని కలిశారు. తమ పార్టీకి మద్దతిచ్చి ఓటేసి గెలిపించాలని కోరారు.

More Related Stories